గోపీచంద్ తో సినిమా తీస్తానంటోన్న దేవా

posted on: Mar 15, 2013 6:47PM

 

 

hero Gopichand|deva kata Gopichand|deva kata|autpnagar surya

 

 

ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు దేవకట్టా... “ఆటోనగర్ సూర్య”కు మధ్యలోనే ఫులిస్టాప్ పెట్టి... ఆర్. ఆర్. మూవీ మేకర్స్ తో మూడో సినిమా మొదలుపెట్టాడు. గోపీచంద్ హీరోగా ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ తీయనున్నట్టు ట్విట్ చేశాడు ఈ యంగ్ డైరెక్టర్. 'అబద్దానికే అంత దమ్ముంటే, నిజానికి ఎంత దమ్ము ఉండాలి'.. అనే కాన్సెప్ట్ తో ఓ చిత్రం చేస్తానని గతంలోనూ దేవకట్టా ట్విట్ చేశారు. అప్పట్లో నానితో చేస్తాడనే వార్తలొచ్చినా....గోపీచందే తన హీరో అని దేవా తేల్చిచెప్పారు. గోపీచంద్ లాంటి మాస్ హీరోని దేవా ఏ రీతిలో తెరపై ఆవిష్కరిస్తాడో చూడాలి .

google-ad-img
    Related Sigment News
    • Loading...